గన్ పేల్చిన గూగుల్‌ అసిస్టెంట్‌

posted on: Jun 1, 2018 12:02PM

 

రోజురోజుకీ టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. పెరుగుతున్న ఈ టెక్నాలజీకి గూగుల్ అసిస్టెంట్‌ ఓ గొప్ప ఉదాహరణ. గూగుల్‌ అసిస్టెంట్‌ను మీరు ఏ సందేహం అడిగినా చెప్పేస్తుంది. రిమోట్‌తో ఆపరేట్‌ చేయగలిగే ఏ పనినైనా మీ బదులు చేసి పెడుతుంది. ఇప్పుడు అలాంటి గూగుల్‌ అసిస్టెంట్‌ సాయంతో అలెగ్జాండర్‌ రెబెన్ అనే వ్యక్తి సంచలనం సృష్టించాడు. తను ఆదేశం ఇవ్వగానే గూగుల్ అసిస్టెంట్ గన్ పేల్చేట్లు ఏర్పాటు చేశాడు. మనం అతిగా ఆధారపడే సాంకేతికత వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో తెలియచేసేందుకే తాను ఈ ప్రయోగం చేసి చూపినట్లు రెబెన్ చెప్పుకొచ్చాడు. నిజమే కదా!

google-ad-img
    Related Sigment News
    • Loading...