TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్‌ని దాటిపోయిన మహేష్

Published on: Thu Dec 18, 2014 1:48PM

 

టాలీవుడ్‌లో టాప్ హీరో మా హీరో అంటే మా హీరోనే అనే పోటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పుడూ వుండేదే. టాలీవుడ్‌లో ర్యాంకింగ్ సంగతి అలా వుంచితే, ఒకచోట మాత్రం మహేషే టాప్ హీరో. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ని మహేష్ బాబు దాటిపోయాడు. ఇంతకీ అది ఎక్కడ? ఇంకెక్కడో కాదు... ఇంటర్నెట్‌లో.. అది కూడా గూగుల్లో. గత పది సంవత్సరాల్లో అంటే 2004 నుంచి 2014 మధ్య గూగుల్లో అభిమానులు వెతికిన స్టార్స్‌కి సంబంధించిన వివరాలను గూగుల్ వెల్లడించింది. ఈ వివరాల్లో మన టాలీవుడ్ హీరోలకి సంబంధించిన వివరాలు కూడా వున్నాయి. ఈ వివరాల ప్రకారం ఈ పదేళ్ళలో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరో మహేష్ బాబు. అయితే ఆ తర్వాతి స్థానం మా హీరోదే అని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారేమో... ఆశ దోశ అప్పడం వడ.. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ స్థానం చెబితే ఆయన ఫాన్స్ ఫీలైపోతారు. అయినప్పటికీ చెప్పక తప్పదు. గూగుల్ రిలీజ్ చేసిన లిస్టులో పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలిచారు. పాపం.. సరే, మొదటి స్థానంలో మహేష్ బాబు వున్నాడని చెప్పకున్నాం కదా.. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న హీరో ఎవరో చెప్పుకుందాం.. ఆ స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించేశాడు. మూడో స్థానాన్ని ప్రభాస్ సొంతం చేసుకుంటే, నాలుగో స్థానాన్ని మాత్రం చిరంజీవి తన అకౌంట్లో వేసుకున్నాడు. ఐదో స్థానం పవన్ కళ్యాణ్‌కి దక్కింది.