TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ‌డ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల‌కు గుడ్‌న్యూస్‌.. సీత‌మ్మ వ‌రాలు..

Published on: Tue Feb 1, 2022 10:45AM

ఈసారి కేంద్ర‌ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత ఇస్తామ‌న్నారు. అందులో భాగంగా చేప‌ట్ట‌బోయే ప‌లు ప్రాజెక్టుల్లో ఏపీ కూడా ఉండ‌టం కాస్త ఆశాజ‌న‌కం. 

నదుల అనుసంధానానికి కేంద్రం పెద్ద పీట వేయ‌నుంద‌ని నిర్మ‌ల తెలిపారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని చెప్పారు. కృష్ణా-గోదావ‌రి న‌దుల అనుసంధానం తెలుగు రాష్ట్రాల చిర‌కాల స్వ‌ప్నం. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో న‌దుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప‌ట్టుసీమ‌తో చ‌రిత్ర‌లో నిలిచారు. 

అటు, తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం న‌దుల అనుసంధానం కోసం ఏపీ సీఎం జ‌గ‌న్‌తో అప్ప‌ట్లో చ‌ర్చ‌లు జ‌రిపారు. అదంతా పొలిటిక‌ల్ స్టంట్ అని ఆ త‌ర్వాత తేలిపోయింది. రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు మ‌రింత ముదిరాయి. తాజాగా, కేంద్ర బ‌డ్జెట్‌లో కృష్ణా-గోదావ‌రి, కృష్ణా-పెన్నా న‌దుల అనుసంధానం గురించి ప్ర‌స్తావించ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి ఆస‌క్తి పెరిగింది. మ‌రి, జ‌గ‌మొండి జ‌గ‌న్‌.. రాజ‌కీయ మొండి కేసీఆర్‌.. ఆ అనుసంధానాన్ని కానిస్తారా?  డౌటే..అంటున్నారు.