TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్ 

Published on: Fri Mar 7, 2025 2:47PM

తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులకు  ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  ఉద్యోగులకు డిఎ 2.5 శాతం  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.   దీనివల్ల సంస్థకు 3.6 కోట్ల భారం అదనంగా పడనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మహలక్ష్మి పథకం ద్వారా  5వేల కోట్ల ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా పొందారు.  మహిళా సమైక్య సంఘాల చేత  మహిళలు ఆర్టీసి బస్సులు కొనుగోలు చేసి అద్దెకు నడిపే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.  రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క  చేతుల మీదుగా ఈ పథకం క్రింద 150 బస్సులను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.  ప్రతీ మండలానికి ఒక బస్సు నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. 
 పాత ఉమ్మడి  కరీంనగర్, ఖమ్మం, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాలలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.