TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందుబాబులకు గుడ్ న్యూస్

Published on: Wed Dec 30, 2020 4:21PM

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ తెలిపింది. బార్లు, క్లబ్బులకు ఒంటిగంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

 

కాగా, కరోనా నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆయా రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ కు అనుమతి లేదని ఇటీవల సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం గమనార్హం.