డిసెంబర్ 4న కేంద్రానికి జీవోఎం నివేదిక

 

 

 

రాష్ట్ర విభజనపై కేంద్రం వేగం పెంచించింది. డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినేట్ సమావేశంలో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదికను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గురువారం నార్తబ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కార్యాలయంలో షిండే, జైరాం రమేష్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ భేటీ అయి జీవోఎం నివేదికకు తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సమాచారం.

 

మరోవైపు వచ్చె మంగళవారానికి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బిల్లు రూపకల్పన పై కసరత్తు మొదలైంది. సిపారసులతో కూడిన నివేదికను జీవోఎం ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం లోపు బిల్లు రూపకల్పన పూర్తవనుంది. అదే సాయంత్రం ఐదు గంటలను ముసాయిదా బిల్లుకి జీవోఎం ఆమోదం తెలపనుంది.