TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారికి రూ.కోటి 80 లక్షల విలువైన పతకాల విరాళం

Published on: Mon Sep 22, 2025 10:16AM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి భక్తుల భూరి విరాళాలు అందజేయడం కద్దు. నిత్యం పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ శక్తి కొద్దీ హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. అలాగే పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు కూడా స్వామి వారికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. తాజాగా గోకర్ణకు చెందిన శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ స్వామివారికి4 బంగారు  పతకాలు విరాళంగా అందించారు.

స్వామీజీ గోకర్ణ పర్తగాలి మఠం తరఫున 15 ఉత్సవర్ల బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను విరాళంగా సమర్పించారు. వీటి విలువ కోటీ 80 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ విరాళాన్ని ఆయన ఆలయ పేష్కార్ రామకృష్ణకు సోమవారం (సెప్టెంబర్ 22) అందజేశారు.