TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దుర్గ గుడిలో గోల్డ్ చోరీ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఉద్యోగులు

Published on: Tue Jun 4, 2019 2:51PM

 

విజయవాడ కనకదుర్గ ఆలయంలో బంగారం చోరీ సంఘటన కలకలం రేపుతోంది. ఆలయంలో పనిచేస్తున్న దంపతులు హుండీ లెక్కింపు సందర్భంగా చేతివాటం ప్రదర్శించి ఎనిమిది గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. దుర్గగుడిలో సింహాచలం అనే ఉద్యోగి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య దుర్గ కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోంది. అమ్మవారి హుండీలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపు సందర్భంగా దంపతులు చోరీకి పాల్పడ్డారు. హుండీలోని బంగారాన్ని సింహాచలం చోరీ చేసి.. తన భార్య చేతికి ఇచ్చి పంపుతుండగా దుర్గగుడి అధికారులు పట్టుకున్నారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు సింహాచలం దంపతులను అదుపులోకి తీసుకున్నారు.