బంగారం దొరికింది
Published on: Fri Dec 20, 2013 12:58PM

శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీల సంధర్బంగా అధికారులు పెద్ద యెత్తున బంగారం స్వాదీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వస్తున్న టైగర్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకుల నుంచి 18కిలోల బంగారు బిస్కెట్లు లభించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు కర్ణాటకకు చెందినవారైనా,ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్నారని అధికారులు చెప్పారు. వీరి పాస్ పోర్ట్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు.


