పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలు!?
Published on: Thu Sep 25, 2025 10:37AM
.webp)
బంగారం ధరల పెరుగుదలకు అడ్డూ ఆపూ లేకుండా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.
దీంతో రానున్న రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరు అవకాశం ఉందని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు ప్రస్తుతమున్న ధర కంటే 77 శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.


