బంగారం ధర తగ్గిందోచ్!
Published on: Wed Jul 31, 2024 4:58PM
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆషాడ మాసం కావడంతో పసిడి ధర తగ్గుతూ.. పెరుగుతోంది. మంగళవారంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదైంది. వచ్చేది శ్రావణ మాసం అయినందున పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నవారు ముందే బంగారం కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,190గా ఉంది. మేలిమి బంగారం ధర మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాములు బంగారం ధర 68, 940గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,190గా ఉంది.


