జెరిమీకి స్వర్ణం, బిందియాకి రజతం
Published on: Sun Jul 31, 2022 5:24PM
కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాలపంట పండిస్తోంది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లల్‌రిన్నుంగా 67 కేజీల విభాగంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో స్వర్ణం అందించాడు. మొత్తంగా ఇది ఐదో పతకం. మొత్తంగా 300 కేజీలు ఎత్తిన జెరెమీ సరికొత్త రికార్డు లిఖించాడు.
ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు రాగా తాజాగా మరో మెడల్ కూడా ఇదే ఈవెంట్‌లో వచ్చింది. 55 కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి దేవీ సిల్వర్ గెలిచింది. స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116కిలోలతో మొత్తం 202 కేజీల బరువు ఎత్తిన బింద్యారాణి రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసు కుంది. దీంతో భారత్ పతకాల సంఖ్యల 4కి చేరింది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.


