TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గిన బంగారం, వెండి ధరలు

Published on: Fri Jan 30, 2026 11:27AM

గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిన బంగారం ధరలు శుక్రవారం (జనవరి 30)  పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో  బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారం ధర ఎనిమిది వేల రూపాయల వరకూ తగ్గింది.అదే విధంగా కిలో వెండి ధర పదిహేను వేల రూపాయల మేర తగ్గింది.

 శుక్రవారం (జనవరి 30) ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో   24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 8,230లు తగ్గి రూ.1,70,620ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల ప‌సిడి  రూ.7,550 తగ్గి రూ.1,56,400కు చేరింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనించింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.4,15,000గా ఉంది.