యోగా గురువుపై హానీ ట్రాప్...50 లక్షలు స్వాహా
Published on: Sun Sep 14, 2025 5:39PM

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రంగారెడ్డి అనే వ్యక్తి యోగాశ్రమంలో యోగా గురువుగా పనిచేస్తున్నాడు. అయితే ఓ ఇద్దరు మహిళలు అనా రోగ్య సమస్యల పేరుతో రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు... అలా చేరిన ఆ ఇద్దరు మహిళలు యోగా గురువు రంగా రెడ్డితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇద్దరు మహిళలు రంగా రెడ్డి తో సన్నిహితం గా ఉన్న సమయం లో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకు న్నారు...
ఇంకేముంది మాస్టారు కాస్త హనీ ట్రాప్ లో చిక్కుకుపోయాడు. దీంతో అమర్ గ్యాంగ్ రంగంలోకి దిగి ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడి యోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొద లుపెట్టారు. మేము అడిగినన్నిడబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు, వీడి యోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు.
వారి బెది రింపులకు భయ పడి పోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి 50 లక్షల రూపాయల చెక్కును ఇచ్చాడు. కొద్ది రోజులు గడి చిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్ యోగ గురువు రంగారెడ్డి కి ఫోన్ చేసి రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశారు.... డబ్బులు త్వరగా ఇవ్వా లంటూ ప్రతిరోజు యోగా గురువుకు ఫోన్ చేసి వేధిం పులకు గురి చేస్తూ ఉన్నారు.
రోజు రోజుకీ వారి వేధింపులు మితి మీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్ కీ చెందిన ఇద్దరు మహిళల తోపాటు ముగ్గురు పురుషులను... మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి చెక్కులు మరియు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


