కృష్ణా నది మీద నింద మోపుతున్న బీజేపీ మాజీ ఎంపీ

 

హనుమంతుడు దళిత వర్గానికి చెందినవాడు  - "బీజేపీ" నేత, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
హనుమంతుడు ‘జాట్’ కులానికి చెందినవాడు - "బీజేపీ" నేత, యూపీ మంత్రి లక్ష్మీ నారాయణ చౌదరి 
మహాభారత కాలం నుంచే భారత్‌లో ఇంటర్‌నెట్ -  "బీజేపీ" నేత, త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ 
మహాభారత కాలం నుంచే జర్నలిజం ఉంది -   "బీజేపీ" నేత, యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ
తొలి విమానాన్ని కనిపెట్టింది భారతీయుడే -   "బీజేపీ" నేత, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్   
ప్లాస్టిక్ సర్జరీ దేవుడు-వినాయకుడు - "బీజేపీ" నేత, ప్రధాని నరేంద్ర మోడీ
కృష్ణానది మా భూమిని ఆక్రమించింది - "బీజేపీ" నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

ఇవన్నీ చూస్తోనే నవ్వొస్తోందా మీకు, నవ్వుకోండి నవ్వుకోండి. మిగతా విషయాలు పాతవే కాబట్టి వాటి సంగతి ప్రస్తుతం ప్రస్తావానర్హం కాదు. ఇక గోకరాజు గంగరాజు గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే, ప్రస్తుతం ఏపీ మొత్తం మీద అక్రమ కట్టడాల కూల్చివేతల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న కట్టడాలను అక్రమ కట్టడాలుగా తేల్చిన సీఆర్డీఏ అధికారులు ఆయా యజమానులకు కూల్చివేత నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అందరితో పాటే బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసుల మీద గోకరాజు గారి స్పందనే ఆసక్తికరంగా మారంది. కరకట్టను తాము ఆక్రమించుకోలేదన్న ఆయన కృష్ణా నదే తమ భూములను ఆక్రమించిందని చెప్పిన లాజిక్ కి మైండ్ బ్లాక్ కావడం విలేఖరుల వంతు అయింది. నదీ భూములను తాము ఆక్రమించలేదని నిజానికి తమ భూములను కృష్ణా నదే కబ్జా చేసిందని అంటున్నారు. 

25 ఏళ్ల క్రితం నుంచి ఉండవల్లిలో 25 ఎకరాల భూమి ఉందని చెప్పుకొచ్చారు. తాను కట్టిన గెస్ట్ హౌస్ కు వైఎస్సార్ హయాంలో మల్లాది విష్ణు ఉడా చైర్మన్ గా ఉండగానే ఉడా, ఇరిగేషన్ శాఖల అనుమతి తీసుకునే కట్టానని గంగరాజు చెప్పారు. బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాలేదని చెప్పారు. దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు.

నదిలో కూడా‌ మాకు ఇంకా ల్యాండ్ ఉందని వరద వచ్చినప్పుడల్లా మా ల్యాండ్ కొంత కోల్పోతున్నామని ఆయన అంటున్నారు. ఫాంహౌస్ కట్టుకున్న తర్వాత నదికి 100 మీటర్ల లోపల కట్టకూడదని జీవో వచ్చిందని గోకరాజు చెప్పారు. ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్నటువంటివి ఎన్నో కూల్చాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తాను కట్టిన భవంతి విలాసవంతమైనది కాదని కేవలం ఫాం హౌస్ మాత్రమే అని వివరించారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారన్న గోకరాజు అందరి మీద చర్యలు తీసుకున్న తర్వాత తన మీద తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు. గోకరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చకు దారితీశాయి. ఆయన మాటలతో అంతా అవాక్కవుతున్నారు.