TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుష్కరాల్లో అపశృతి.. 22 మంది మృతి

Published on: Tue Jul 14, 2015 12:31PM

 

ఇరు రాష్ట్రాల్లో గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మహాపుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్కరాలు ప్రారంభమయిన మొదటి రోజునే అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల ప్రారంభంరోజునే రాజమండ్రిలోని పుష్కర ఘాట్‌కు అంచనాకు మించి భక్తులు రావడంతో కోటగుమ్మం వద్ద జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.భక్తుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.