ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి
Published on: Tue Jul 12, 2022 7:42AM
ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం వద్ద వరద నీటితో గోదావరి పోటెత్తుతోంది.
ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తి వస్తుండటంతో అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు.
విపత్తు నిర్వాహక బృందాలను అప్రమత్తం చేశారు. ఇక కృష్ణా నదికీ వరద ప్రవాహం పెరుగుతుండటంతో కృష్ణా బ్యారేజి నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదిలో ప్రయాణాలను నిషేధించారు. వరద నీటిలో స్నానాలు చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.


