TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహోగ్రంగా గోదావరి వరద

Published on: Wed Jul 13, 2022 9:48PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అయితేనేమీ.. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలు వల్ల అయితేనేమీ.. వేదంలా ఘోషిస్తూ.. ప్రవాహించే గోదావరి.. ఉగ్రరూపంలోకి మారి దిగువ ప్రాంతాలకు ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలే కాదు.. గోదావరి పరివాహక ప్రాంతాలు సైతం నీట మునుగుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో.. భద్రాచలం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి.. పలు చోట్ల కొండ చరియలు  విరిగిపడ్డాయి. అయితే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షపు నీరంతా గోదావరిలో కలిసి.. దిగువకు ప్రయాణిస్తోందీ. దీంతో తెలుగు రాష్ట్రాలకు గోదావరి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా.. రెండు రాష్ఱాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. తెలంగాణలో బాసర నుంచి  భ్రదాచలం వరకు.. ఆపై ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి బీభత్స స్థాయిలో ప్రవహిస్తూ... ఆయా ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.  

అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌తోపాటు భద్రచాలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.   ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రి వద్ద గల రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ వద్ద   గోదావరి భారీ స్థాయిలో ప్రవహిస్తోంది.  కోవ్వూరులోని గోష్పాద క్షేత్రం  నీట మునిగిపోయింది.

  కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఏటూరునాగరం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా ఆయా పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.

అలాగే పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది. ఆ క్రమంలో పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగవకు వదిలారు. మరోవైపు.. గోదావరికి భారీగా వరద నీరు పొటెత్తడంతో.. ఆయా పరివాహక ప్రాంతాలతోపాటు లంక గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరదలతో నిరాశ్రయలైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి... వారికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను గోదావరి జిల్లాలో ఎటువంటి పరిస్థితినైనే ఎదుర్కొనేందుకు సిద్ధం చేశారు.  . ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ నుంచి 15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు  విడుదల చేశారు.