Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ మాజీ సీఎంకు బీజేపీ సర్కార్ జీవితకాల కేబినెట్ హోదా
posted on: Jan 8, 2022 10:42AM
ప్రతాప్ సింగ్ రాణే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఒకటి రెండు కాదు ఏకంగా పది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారిగా 1972లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1980-2007 మధ్య ఆరుసార్లు (16 సంవత్సరాలు) ముఖ్యమంత్రిగా, 2007-2012 మధ్య అసెంబ్లీ స్పీకర్గానూ సేవలు అందించారు. ఆయన వయసు 83 ఏళ్ళు ... అయినా ఇంకా క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మరో రెండు మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆయన టికెట్ కేటాయించింది. ప్రతాప్ సింగ్ సొంత నియోజక వర్గం ‘పొరియమ్’ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయనే పోటీ చేస్తారని కాంగ్రెస్ తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించింది. కానీ, ఇంతలోనే, కథ కొత్త మలుపు తిరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకుండానే, జీవితకాల కేబినెట్ హోదా దక్కింది.
విషయంలోకి వస్తే ప్రతాప్ సింగ్ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరోసారి కూడా కాంగ్రెస్ తరఫున రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.అయితే ప్రతాప్సింగ్ ప్రకటనకు ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే అడ్డు పుల్ల వేశారు. 83 ఏళ్ల వయసులో ఇంకా రాజకీయాల్లో కొనసాగడం ఎందుకు? ఆరు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలే గాని, ఓటమి పాలై పదవీ విరమణ పొందడం సరికాదు, అంటూ ఆయన్ని ఎన్నికల బరిలోంచి తప్పించారు. ఇప్పుడు అదే స్థానం నుంచి పోటీకి విశ్వజిత్ రాణే సిద్ధమవుతున్నారు.
ఇదలా ఉంటే గోవా ప్రభుత్వం ఆయనకు జీవితకాల కేబినెట్ హోదా ప్రకటించింది. గోవా రాష్ట్రానికి విశేష సేవలు అందించిన ప్రతాప్ సింగ్ రాణేకు జీవితకాలం కేబినెట్ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గోవా ముఖ్యమంత్రి, ప్రమోద్ సావంత్ ప్రకటించారు. గత 50 ఏళ్లగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్న ప్రతాప్.. ముఖ్యమంత్రిగా, స్పీకర్ గా సేవలు అందించారు. ప్రతాప్ సింగ్ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రమోద్ సావంత్, జీవితకాలం కేబినెట్ హోదా ద్వారా రాణేకు ఓ మంత్రికి అందే గౌరవం, అన్ని సౌకర్యాలు లభించనున్నాయి.
అయితే, బీజేపే ప్రభుత్వం నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న ప్రతాప్ సింగ్ రాణేకు జీవితకాల కేబినెట్ హోదా ఇవ్వడం కొంత ఆశ్చర్య పరిచే విషయం అయితే ఆయన ఈ వయసులో పదవికి ఆశపది పార్టీకి పంగనామాలు పెట్టడం మరింత విశేషం అంటున్నారు. అయితే ఇంతకీ ఆ గౌరవం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇచ్చినట్లా .. ఆయన కుమారుడు, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్ల్యే చిన్న రాణేను సంతృప్తి పరిచేందుకా .. అదీ కాకపోతే, కాంగ్రెస్ ఖాతాలోంచి ఒక సీటును మైనస్ చేసేందుకా? అంటే మూడోదే ముఖ్య కారణం. అయినా మూడుకు మూడు కారణాలుగానే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.



.webp)


