TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గోవా కాంగ్రెస్ కు మరో షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా..

Published on: Fri Mar 17, 2017 12:10PM

 

గోవాలో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే ఇప్పటికే తన పదవికి రాజీనామా చేయగా... ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే సావియో రోడ్రిగ్వెస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీని తమ నేతగా అంగీకరించలేనని... రాహుల్ గాంధీ బాధ్యత తీసుకోకపోవడంతో దిగ్విజయ్ సింగ్ ఓటమికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.


కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిన్న పార్టీలకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు రాగా, బీజేపీకి 12, కాంగ్రెస్ కు 17 వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు గూడకట్టడంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. అంతేకాదు నిన్న జరిగిన విశ్వాస పరీక్షలో కూడా పారికర్ సర్కారు విజయం సాధించింది.