బలపరీక్షలో నెగ్గిన పారికర్..
Published on: Thu Mar 16, 2017 12:32PM
.jpg)
గోవా అసెంబ్లీలో బలపరీక్ష మొదలైంది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. విశ్వాస పరీక్షకు 22 మంది సభ్యులు మద్దతు పలకడంతో పారికర్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. కాంగ్రెస్ పార్టీకి 17 ఓట్లున్నా కానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి. అయినా కూడా బలపరీక్షలో బీజేపీ నెగ్గి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా ఒక కాంగ్రెస్ సభ్యుడు వాకౌట్ అయ్యాడు.


