ఎవరి బలమెంతో తేల్చుకోండి...
Published on: Tue Mar 14, 2017 3:43PM
.jpg)
గోవాలో ప్రభుత్వ ఏర్పాటు పై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు.. గవర్నర్ నిర్ణయించిన ప్రకారం మంగళవారం (ఈరోజు) సాయంత్రం ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం చేయడానికి అంగీకరించింది. అంతేకాదు గురువారం బలపరీక్ష నిర్వహించి.. ఎవరి బలమెంతో తేల్చాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు సీఎంగా ప్రమాణం చేయబోతున్న పారికర్ ఎల్లుండి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. కాగా 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే.


