జీవో 43ని గౌరవించాల్సిందే: హైకోర్టు

 

రెండు రాష్ట్రాల మధ్య మార్చి 31, 2015 వరకు రవాణా పన్ను వుండదంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇచ్చిన 43వ నంబర్ జీవోను రెండు రాష్ట్రాలూ గౌరవించాల్సిందేని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేసి త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్ట్ క్యారేజీలు, టూరిస్ట్ బస్సులు, మాక్సీ క్యాబ్‌ల నుంచి మోటారు వాహన పన్ను వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ విజయవాడకు చెందిన రవాణా ఆపరేటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ మీద స్పందిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 43వ నంబర్ జీవోకు విరుద్ధంగా ఏ రాష్ట్రమూ వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.