TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నా.. నువ్వే నా దైవం

Published on: Sat Jul 16, 2022 3:47PM

సైనికులంటే అంద‌రికీ అపార గౌర‌వ‌మే. దేశ ర‌క్ష‌కులుగానే కాదు దేశ‌ప్ర‌జ‌లు ఎప్పుడు ఘోర ప్ర‌మాదాల్లో చిక్కుకున్నా, ప్ర‌కృతి వైప‌రీత్యాలు భ‌య‌పెట్టినా ప‌రుగున వ‌చ్చి ఆదుకునేది సైనికులే. త‌మ‌ ప్రాణాల కంటే ప్ర‌జ‌ల ప్రాణాలే మిన్న‌గా  భావించ‌డం వారి ప్ర‌త్యేక‌త‌. వారి స‌హ‌జ గుణ నిధి. అందుకే వారికి దేశ మంతా మొక్కాలి. 

ఈ పాపా అదే చేస్తోంది. ఈ చిన్నారిలో వారి ప‌ట్ల వున్న భ‌క్తి భావ‌న అంద‌రినీ ఆక‌ట్టు కుంటోంది. ఒక ఆర్మీ జ‌వాను ఎదురుగా వ‌స్తుండ‌టం చూసి కేవ‌లం ప‌ల‌క‌రించ‌డ‌మే కాకుండా అత‌ని పాదాల‌కు న‌మ‌స్క‌రించింది. 

ఎక్క‌డా, ఎవ‌రు అనే సంగ‌తి కంటే అస‌లు పిల్ల‌ల్లో కూడా ఇంత‌టి దేశ‌భ‌క్తి వుండ‌టం హ‌ర్ష‌ణీయం అంటు న్నారు తోటి సైనికులు, అధికారులు. దీన్ని ఒక‌రు వీడియో తీసి నెటిజ‌న్ల‌కు అందుబాటులో పెట్టారు.  త‌ల్లిదండ్రులంతా త‌మ పిల్ల‌లకు చిన్న‌త‌నంలోనే దేశ‌భ‌క్తి అల‌వ‌ర్చ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రా యాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇది నిజంగా ఎంతో ప్రేమ‌, దేశ‌భ‌క్తిని తెలియ‌జేసింద‌ని  ఒక అధికారి ఆనంద భాష్పాల‌తో ఆ చిన్నారిని దీవించారు.