Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్యాచారం, దారుణ హత్య
posted on: Nov 29, 2012 7:02PM

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. ఓ వివాహితను ఎత్తుకెళ్లి గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి చంపేశారు. ఆల్వాల్ జవహర్ నగర్ లో పదిరోజుల్లో ఇలాంటిది ఇది రెండో దారుణ హత్య కావడం విశేషం.
పదిరోజుల క్రితం పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు దారుణంగా చెరిచి తమ గుట్టు బైటపడుతుందేమోనని చంపేశారు. శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.

మహారాష్ట్రకి చెందిన దత్తూరాజ్, సక్కుబాయ్ హైదరాబాద్ ఆల్వాల్ ప్రాంతంలో ఉన్న జవహర్ నగర్ లో ఉంటూ కూలిపని చేసుకు బతుకుతున్నారు. పిల్లాడికి అన్నం ఇచ్చేందుకు స్కూల్ కెళ్లిన సక్కుబాయి రాత్రియినా తిరిగి రాకపోవడంతో దత్తూరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మర్నాటి ఉదయం రచన కాలనీలో సక్కుబాయి శవం పోలీసులకు దొరికింది. ఎవరో దారుణంగా చెరిచి గొంతుకోసి మరీ చంపేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. క్లూస్ టీమ్ ఆధారాల్ని సేకరించింది. జాగిలాల్ని రంగంలోకి దించారు.


.jpg)



