TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసింది!

Published on: Mon Aug 15, 2022 5:53AM

మనం చిన్పప్పుడు పాము నుంచి చిన్నారిని కాపాడిన ముంగీస కథ విన్నాం. అలాగే పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. అలాగే ఆడుకుంటున్న నన్ను డిస్ట్రబ్ చేస్తే ఊరుకుంటానా అంది టర్కీలోని చిన్నారి. హాయిగా ఆడుకుంటున్న తనను కాటేసిన పామును కసిదీరా కొరికి చంపేసిందా చిన్నారి.  

ఎవరి సాయం అక్కర్లేకుండానే ఓ రెండేళ్ల చిన్నారి పాముని కొరికి చంపేసింది. ఔను నిజం. ఈ సంఘటన టర్కీలో జరిగింది. టర్కీలోని బింగోర్ నగరంలో తన ఇంటి ముందు హాయిగా ఆడుకుంటున్న ఓ చిన్నారిని పాము కాటేసింది. అదీ ఆ బాలిక కింది పెదవిపై. పాపం చురుక్కుమందేమో ఆ పాపకు పట్టలేనంత కోపం వచ్చేసింది.

వెంటనే ఆ పామును ఒడిసి పట్టుకుని కసి దీరా కరిచి చంపేసింది. ఆ తరువాత పెదవి మంట తట్టకుకోలేక ఏడవడం మొదలెట్టింది. ఇంట్లోనించి వచ్చి చూసిన పాప తల్లిదండ్రులకు విషయం అర్ధమైంది. వెంటనే తమ చిన్నారిని ఆసుపత్రికి  తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి పెదవిపై పాము కాటేసిందని నిర్ధారించారు. సకాలంలో తీసుకురావడంతో గండం తప్పిందని చెప్పారు. ఇప్పుడా చిన్నారి కోలుకుంది.