స్కూల్లోకి చొరబడి చిన్నారి హత్య
Published on: Wed Nov 7, 2012 1:42PM

క్లాస్ రూమ్ లో మాస్టారు లేరు. పిల్లలు అల్లరి చేస్తున్నారు. కోలాహలంగా ఉంది. ఉన్నట్టుండి ఓ రాక్షసుడు నేరుగా స్కూల్లోకి, క్లాస్ రూమ్ లోకి చొరబడ్డాడు. తాను తెచ్చిన పదునైన కత్తితో ఓ బాలికను పొడిచేశాడు. నిర్దాక్షిణ్యంగా మరో బాలిక గొంతు కోశాడు. పిల్లల అల్లరిని భరించలేక తానీపని చేశానని ఆ దుర్మార్గుడు చెబుతున్నాడు. మదన్ గోపీ అనే ఓ రోజుకూలీ ఈ దారుణానికి తెగబడ్డాడు.
జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భీమ్ లో ఈ దారుణం జరిగింది. చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేని నిందితుడు తనకు వీలైతే క్లాస్ లో ఉన్న పిల్లలందర్నీ ఇలాగే చంపేస్తానంటున్నాడు. చాలా రోజులుగా పిల్లల గోల భరించలేకుండా ఉన్నానని, అందుకే కసితీరా పొడిచేశానని చెబుతున్నాడు. గ్రామస్తులంతా కలిసి మదన్ గోపీని చావచితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.


