Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్... ఓ దారితప్పిన విమానం...
posted on: Apr 2, 2015 5:54PM

నిన్న కాక మొన్ననే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెల్లతోలు ఉండటం వల్లే సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాగలిగారని, అదే రాజీవ్ గాంధీ ఏ నైజీరియా అమ్మాయినో పెళ్లి చేసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ గొడవ అలా ఉండగానే గిరిరాజ్ తాజాగా రాహుల్ గాంధీ మీద మరో వ్యంగ్యాస్త్రం విసిరారు. సముద్రంలో పడిపోయి గల్లంతై ఇప్పటి వరకు ఆచూకీ తెలియకుండా పోయిన మలేషియా విమానం లాగే... కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆచూకీ కూడా తెలియడంలేదని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెబుతున్నానని చెప్పిన కాసేపటికే గిరిరాజ్ మళ్లీ రాహుల్ గాంధీ మీద ఈ వ్యాఖ్యలు చేశారు.






