తెలంగాణకున్నఅవకాశాలు ఏపీకి లేవు..
Published on: Tue Jul 24, 2018 4:58PM
మంగళవారం రాజ్యసభలో ఏపీ విభజన చట్టం, ప్రత్యేక హోదా అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రసంగించారు.రాష్ట్ర విభజన చరిత్ర తెలిస్తేనే ఏపీ సమస్యలేంటో తెలుస్తాయని ఆజాద్ అన్నారు.1947లో కోస్తాంధ్ర, రాయలసీమ మద్రాస్‌లో భాగంగా ఉన్నాయని, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదని చెప్పారు. ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా హైదరాబాద్ మూడు భాగాలుగా విడిపోయిందని, హైదరాబాద్‌లోని మూడు భాగాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రకు వెళ్లాయని వివరించారు. చరిత్ర పరంగా చూసుకున్నా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
.jpg)
ఏపీ ప్రజల సమస్యను సానుభూతితో చూడాలని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అనేక అంశాలపై తనకు అవగాహన ఉందని, ఏపీతో తనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని,తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని, ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో.. అలాగే ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకోవడం అంతే సమంజసమని ఆజాద్ వ్యాఖ్యానించారు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని బీజేపీ నేతలే అనాడు రాజ్యసభలో అడిగిన విషయాన్ని ఆజాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదని ఆజాద్ ఆవేదన వ్యక్తంచేశారు.అప్పుడు అడిగిన మీరే ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.


