TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ఆజాద్

Published on: Tue Jun 5, 2012 11:59AM

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి ఆయన జగన్ గురించి మాట్లాడే మాటలు పరిశీలిస్తే అస్సలు నోటికి అదుపే లేదన్నట్లుంది. ఒక ప్రకటనకు మరో ప్రకటనకు పొంతన ఉండడం లేదు. అసలు జగన్ కాంగ్రెస్ లో ఉండి ఉంటే కేంద్ర మంత్రి పదవి ఛాన్స్ వచ్చేదంటున్నారు. శవరాజకీయాలు చేసినందువల్లే జగన్ నేడు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి అవ్వాలని జగన్ తండ్రి శవాన్ని పక్కన పెట్టి తాను సిఎం కావాలని కోరుకుంటున్నారంటూ ఎం.ఎల్.ఎ.ల సంతకాలు సేకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి వల్లే ఎంతో మంది కాంగ్రెస్ నేతలు ఊచలు లెక్కపెడుతున్నారని అంటూ కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా ఉదంతాన్ని జగన్ కేసుతో పోల్చారు. అందరూ అవినీతికి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటుంటే ఆజాద్ ఆయన్ను మంచోడని, జగన్ దోపిడీదారుడని విమర్శిస్తున్నారు. ఒక్కోచోట జగన్ కాంగ్రెస్ లో కొనసాగి ఉంటే సిఎం కూడా అయ్యేవాడని ఆజాద్ ప్రచారం చేయటం అడ్డదిడ్డంగా ఆయన మాట్లాడగలడని తేల్చేస్తోంది.