TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కట్టడాల కూల్చివేత ఆపండి: జీహెచ్ఎంసీ

Published on: Thu Jul 17, 2014 7:06PM

 

హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతలను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ తీర్మానం చేసింది. ఈమేరకు గురువారంర జరిగిన జీహెచ్‌ఎంసీ స్థాయిసంఘ సమావేశంలో తీర్మానించారు. హైదరాబాద్‌ నగరంలోని అక్రమ కట్టడాల కూల్చివేతను ఆపాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ పాలక మండలి లేఖ రాయనుంది. అక్రమ కట్టడాలను కూల్చడానికంటే ముందు అక్రమ నిర్మాణాలకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకున్నాకే ఆయా కట్టడాల కూల్చివేతలు జరపాలని స్థాయి సంఘం పేర్కొంది.