TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బల్దియా కింగ్ ఎవరు..?

Published on: Fri Feb 5, 2016 10:30AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రేటర్ ఎన్నికలు రావడం జరిగిపోయింది.. ఎన్నికలు ముగియడం అయిపోయింది. అయితే ఇప్పుడు అందరూ ఆసక్తి చూసేది మాత్రం ఎన్నికల ఫలితాల కోసం. అన్ని పార్టీలూ పోటా పోటీగా ప్రచారం నిర్వహించి. మీరెంత అంటే.. మీరెంత అంటూ.. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది మేము అని ఒక పార్టీ అంటే.. ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వండి.. ఇంకా అభివృద్ధి చేస్తామని ఇంకో పార్టీ.. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే పదవికి రాజీనామా చేస్తామంటూ సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఇలా అనేక పరిణామాలమధ్య గ్రేటర్ ఎన్నికలు జరిగిపోయాయి.

అసలు సినిమా అంతా ముదుంది.. మరి ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మారు..? ఎవరి మాటలను నమ్మి ఎవరికి ఓటు వేశారు..?ఎవరికి గ్రేటర్ పట్టం కట్టారు..? అని అటు రాజకీయనాయకులతో పాటు ప్రజలు కూడా అందరూ చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. బల్దియా కింగ్ ఎవరూ అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పలు ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని బాగానే కష్టపడింది. కేసీఆర్ తనయుడు గ్రేటర్ ఎన్నికలు బాధ్యతను మొత్తం తమ భుజాలపై వేసుకొని చాలా కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ కూడా గెలిచినట్టే. కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టినట్టే. అంతేకాదు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిచినట్టయితే కొన్ని సంవత్సరాల వరకూ టీఆర్ఎస్ కు తిరుగులేనట్టే.

ఇక తెలంగాణలో కాస్తో కూస్తో ఆదరణ ఉన్న పార్టీ అంటే టీడీపీ. సార్వత్రిక ఎన్నికల్లో సంగతేమో కాని.. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు టీడీపీ గట్టి పోటీనే. ఎలాగూ గ్రేటర్లో సెటిలర్లు ఎక్కువ కాబట్టి ఆ ఓట్లు ఇటు పడే అవకాశాలు చాలా ఎక్కువనే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందో.. చూడాలి. ఒకవేళ పరిస్థితులు తారుమారైనా కనీసం 25 స్థానాలు గెలుచుకోకపోతే కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది. ఇక మిగిలిన పార్టీల సంగతి కూడా అంతే. గౌరవ ప్రధమైన స్థానాలు దక్కించుకోకపోతే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.

మరి ఇలాంటి తరుణంలో తమ పార్టీల భవిష్యత్ ఎంటో తెలియాలంటే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేంత వరకూ ఆగాల్సిందే. ఈ రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించడంతో బల్దియా కింగ్ ఎవరో.. ఎవరు నగరాన్ని ఏలుతారో తెలిసిపోతుంది.