గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..
Published on: Fri Feb 5, 2016 2:15PM

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు..144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అంతేకాదు కౌంటింగ్ హాల్స్ లోకి సెల్ ఫోన్లకి అనుమతి లేదు. కౌంటింగ్ కోసం 5626 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. కాగా ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లో, 1333 మంది పోటిచేయగా.. మొదటి రెండు గంటల్లో 26 కేంద్రాల్లో ఫలితాలు వెల్లడవుతాయని తెలుస్తోంది.


