గ్రేటర్ ఎన్నికల రీపోలింగ్..
Published on: Fri Feb 5, 2016 9:05AM

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా పాతబస్తీ, పురానాపూల్ లో రీపోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ డివిజన్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 34 కేంద్రాల్లో జరగనున్న ఈ రీపోలింగ్‌లో 34, 413 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈరోజు ఓట్ల లెక్కింపు ఉన్న కారణంగా సాయంత్రం 3 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల తరువాతే ఫలితాలు వెల్లిడించనున్నామని అధికారులు తెలుపుతున్నారు.


