ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికలు..
Published on: Tue Feb 2, 2016 4:18PM

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు ఉదయం 7 గంటలన నుండి ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. అయితే ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల్లో ఏదో అక్కడక్కడ చిన్న గొడవలు జరిగినా.. మొత్తం మీద చాలా సజావుగానే ముగిశాయి. 150 డివిజన్‌లలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 48.50 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం.


