మేం ఓటు వేశాం.. ప్రముఖుల సెల్ఫీలు
Published on: Tue Feb 2, 2016 12:28PM
ఏ చిన్న పని చేస్తున్నా దానికి సెల్ఫీ తీసుకోవడం ఇప్పుడు అలవాటైపోయింది. సామాన్య ప్రజల నుండి.. ప్రముఖుల వరకూ సెల్పీలు తీసుకొని తమ ముచ్చటను తీర్చుకుంటారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల వేళ కూడా ఓట్లు వేసి తమ సెల్ఫీలు తీసుకున్నారు ప్రముఖులు. ఓటు వేసి తమ చేతికున్న సిరా చూపిస్తూ సెల్ఫీని తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘మేం ఓటు వేశాం.. మీరూ వేశారా.. లేదంటే ఇప్పుడే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి’ అంటూ దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.







