TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.. 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్

Published on: Tue Feb 2, 2016 11:32AM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు. నెరేడ్‌మెట్ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసుల  ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జంట నగరాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.