11 గంటల వరకు పోలింగ్ శాతం..
Published on: Tue Feb 2, 2016 10:54AM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాన్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు జంట నగరాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకూ 16.65 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.


