ఓటు వేసేందుకు వెళ్తున్నారా!
Published on: Tue Feb 2, 2016 8:38AM
.jpg)
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
- 5 గంటలలోపల క్యూలో ఉన్నవారు ఎంత ఆలస్యమైనా ఓటు వేసి వెళ్లవచ్చు.
- ఇవాళ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి ఓటరు స్లిప్‌ను పొందవచ్చు(ghmc.gov.in)
- ఓటు వేసే చోట సెల్‌ఫోన్లను అనుమతించరు.
- పోలింగ్ కేంద్రం లోపల ఫొటోలు తీయడం నిషిద్దం.
- అంధులు తమ ఓటు వేసేందుకు వేరొకరిని వెంటపెట్టుకుని రావచ్చు.
- ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఉంటుంది.
- వికలాంగులు నేరుగా వీల్‌చైరుతో పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లవచ్చు.
- ఇప్పటికే వేరెవరన్నా మీ ఓటు వేసేసి ఉంటే అక్కడి ఉన్న అధికారికి ఫిర్యాదు చేయండి.


