TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కు అంత సీన్ లేదంటున్న తలసాని..

Published on: Thu Jan 28, 2016 1:48PM

ఎన్నికల సమయంలో పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మామూలే. మీరు ఎన్నికల్లో విజయం సాధిస్తే నేను పార్టీకి రాజీనామా చేస్తా అని ఒకరంటే.. మీరు గెలిస్తే మేం రాజీనామా చేస్తాం అంటూ పోటాపోటీగా సవాళ్లు విసురుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్బంగా ఆ సవాళ్లు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుటికే కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి లాంటి ముఖ్య నేతలు సవాళ్లు విసిరారు. ఇప్పుడు వారి జాబితాలో తలసాని కూడా చేరిపోయారు. ఈసారి తలసాని కాంగ్రెస్ పార్టీపై సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అని ఎద్దేవ చేశారు. మరి తలసాని సవాల్ కు కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

కాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అయితే తీవ్రంగా కృషిచేస్తోంది. ఎన్నికల బాధ్యతను మొత్తం తన భుజాల మీద వేసుకొని కేటీఆర్ ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఇక మిత్రపక్షమైన టీడీపీ బీజేపీ.. టీఆర్ఎస్ కూడా బానే కష్టపడుతున్నాయి. మరి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.