TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీహెచ్ఎంసీ ఎన్నికలు. చంద్రబాబు లోకేశ్ కు ఎంట్రీ ఇస్తారా..?

Published on: Wed Dec 2, 2015 11:09AM

జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలాఖరు కల్లా నిర్వహిస్తామని తెలంగాణ అధికార ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో  ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాల గురించి పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తులు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక టీడీపీ నుండి అయితే చంద్రబాబే ఏకంగా విజయవాడ నుండి వచ్చి మరీ హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని ఇప్పుడు అందరి దృష్టి మాత్రం లోకేశ్ మీద పడింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగు పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు.. కానీ లోకేశ్ ఎంతవరకూ గెలుపుకోసం కృషి చేస్తారు..ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంతమేరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఎలాగూ సీఎం ఏపీలో పరిపాలన బాధ్యతల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. గ్రేటర్ ఎన్నకల బాధ్యత లోకేశ్ కు అప్పగిస్తే బావుంటుందని చెబుతున్నారట.

కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎంతైనా టీడీపీకి కొంచెం ఆదరణ తక్కువ. ఇలాంటి నేపథ్యంలో బాద్యతలు లోకేశ్ కు అప్పగిస్తే.. ఎన్నికల్లో వచ్చే ఫలితాల సామర్ధ్యం లోకేశ్ పై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే ఈ ఎన్నికలకు లోకేశ్ ను దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ పడినవెంటనే లోకేశ్ కూడా చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో దిగుతారని నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంతవరకూ లోకేశ్ ఎంట్రీ ఉంటుందో చూడాలి.