జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరగా జరపండి

 

జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు 249 రోజులు గడువు కావాలని వార్డుల పునర్విభజన జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం న్యాయ స్థానాన్ని కోరింది. అయితే సోమవారం హైకోర్టులో ఈ ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. అంత గడువు ఇవ్వలేమని, అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో రావాలని హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వానికిసూచించింది.