టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. 11న మేయర్ ఎంపిక

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికారపార్టీ టీఆర్ఎస్ కారు జోరుకి అన్ని పార్టీలు చిత్తుచిత్తయ్యాయి. మొత్తం 150 డివిజన్లలో దాదాపు నగరంలోని అన్ని చోట్లా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి 99 స్థానాలను దక్కించికుంది. కనీసం టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించని విధంగా ఆపార్టీకి గెలుపునిచ్చారు నగర ప్రజలు. దీంతో కారు స్పీడ్ ను తట్టుకోలేక అన్ని పార్టీలు పత్తా లేకుండా పోయాయి. మరోవైపు ఈ నెల 11 వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరుగుతుందని.. ఇప్పటి వరకూ మేయర్‌ అభ్యర్థి ఎవరనేది టిఆర్‌ఎస్‌ ఇంకా నిర్ణయించలేదని పార్టీ నేతలు చెపుతున్నారు.

 మొత్తం 150 డివిజన్లలో

* టిఆర్‌ఎస్‌ - 99
* ఎంఐఎం - 44
* కాంగ్రెస్‌ - 2
* టిడిపి - 1
* బిజెపి - 4