పోలీసులకే బంపరాఫర్..... వెయ్యి షేర్లు వస్తేనే..!

 

ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్ అందరిపై ఎంత ఉందో తెలిసిందే. ఏ చిన్న పని చేసినా...చేస్తున్నా ఓ ఫొటో తీయడం... దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఆ ఫొటోకి ఎన్ని లైకులు వచ్చాయి.. షేర్లు వచ్చాయి చూసుకోవడం ఇదే పని. ఈ నేపథ్యంలోనే ఓ నిందితుడు ఏకంగా పోలీసులకే బంపరాఫర్ ఇచ్చి షాకిచ్చాడు. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే... అమెరికాలోని మిచిగాన్‌ కు చెందిన రెడ్‌ ఫోర్డ్‌ టౌన్‌ షిప్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఛాంపిగ్నే టోరినో అనే వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తోంది. అయితే టోరినో సోషల్ మీడియాలో తాను పెట్టే పోస్టులకు వెయ్యి షేర్లు వస్తే స్వయంగా వచ్చి లొంగిపోతానని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు ఓ బహుమతి కూడా ఇస్తానని చెప్పాడు. ఆ బహుమతి ఏంతో తెలుసా.. డజన్ డఫ్ నట్స్ అట. ఇక టోరినో ఇచ్చిన ఆఫర్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిజంగానే అతని పోస్టులకు వెయ్యి షేర్లు వచ్చేట్టు చేశారు. ఇక టోరినో కూడా తాను ఇచ్చిన మాట ప్రకారం... నిజంగానే పోలీసుల ముందు లొంగిపోయాడు. మొత్తానికి ఓక నిందితుడు మాట మీద నిలబడి లొంగిపోవడం గ్రేటే.