గోపాల్ కందా గీతికను హర్ట్ చేశాడా!
Published on: Thu Aug 23, 2012 4:24PM
ఎయిర్ హోస్టెస్ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాని పెళ్లాడలేకపోయానన్న దిగులుతోనే ఆమె ప్రాణాలు తీసుకుందన్న వదంతులు గట్టిగా వ్యాపిస్తున్నాయి. గోవాలో కందా కేసినోలో పనిచేస్తున్న మరో యువతితోకూడా కందాకి దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనివల్లే గీతిక మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుందన్న ప్రచారం జోరుగా పాకిపోతోంది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రియుడు మరో భామతో ఎఫైర్ నడపడాన్ని గీతిక జీర్ణించుకోలేకపోయుంటుందని ప్రచారం జరుగుతోంది.


