ఇండియా నుంచి ఆస్కార్కి ‘లయర్స్ డైస్’
Published on: Tue Sep 23, 2014 4:37PM

ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఆస్కార్ అవార్డు బరిలో హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ చిత్రం నిలిచింది. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ఈ సినిమా భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డు పరిశీలకు పంపడానికి ఎంపికైంది. గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ఈ సినిమా మలయాళ నటి గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో రూపొందింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన 12 మంది జ్యూరీ సభ్యులు ఈ సినిమాను ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేశారు. ఒక గిరిజన మహిళ తన మూడేళ్ళ కూతురుతో కలసి తన భర్తను వెతుక్కుంటూ వెళ్ళే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. 61వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ‘లయర్స్ డైస్’ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతోపాటు రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రఫీ, గీతాంజలికి ఉత్తమ నటి అవార్డు లభించాయి. ఇప్పుడు ఈ సినిమా 87వ ఆస్కార్ అవార్డుల పోటీలో నిలిచింది.


