గీతారెడ్డికి సిబిఐ స‌మ‌న్లు

 

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి ఇంకా సిబిఐ గండం త‌ప్పిన‌ట్టుగా లేదు ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ జైలు ఊచ‌లు లెక్కపెడుతండ‌గా, ధ‌ర్మాన, స‌భిత‌లు సిబిఐ ఆఫీస్ చుట్టూ చ‌క్కర్లు కొడుతున్నారు ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో మంత్రి కూడా చేరిపోయింది. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ భూకేటాయింపుల విష‌యంలో మంత్రి గీతా రెడ్డికి సిబిఐ స‌మ‌న్లు జారీచేసింది.

లేపాక్షి నాలెడ్జ్ హబ్ విష‌యంలో గీతారెడ్డి చేసిన భూకేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌తో సిబిఐ మంత్రి గీతారెడ్డికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ వ్యవ‌హారంలో మంగ‌ళ‌వారం సిబిఐ గీతారెడ్డిని విచారించే అవ‌కాశం ఉంది. అందుకు కావాల్సిన ప‌ర్మిష‌న్స్ కోసం గతంలోనే రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించిన సిబిఐ లీగ‌ల్‌గా అన్ని ఫార్మాలీటీస్‌ను పూర్తి చేసింది.

అయితే  గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతివ్వడంతో  ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించారు.