కరోనా కాలం కలిసోచ్చింది.. 'గీత పొగత్' అంతరంగం...!!

ప్రపంచవ్యాప్తంగా జనజీవితాన్ని స్తంభించేలా చేసిన కరోనా వల్ల అనేక రంగాలు చతికిలాబడ్డాయి. కరోనా వల్ల టోక్యో నగరంలో ఈ సంవత్సరం జరగాల్సిన 'ఒలంపిక్స్ క్రీడలు' వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో చాలా మంది క్రీడాకారులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఒకరి విషయంలో మాత్రం అది అదృష్టంగానే భావించుకోవచ్చేమో...ఆ వ్యక్తే కామన్వెల్త్ క్రీడల్లో రేజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన గీత పొగత్. 2010లో జరిగిన కామన్ వెల్త్ గోమ్స్ లో మన దేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం ఆమె సాధించారు. ఒలంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే. 2016లో ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న గీత 2019లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్  కరోనా కారణంగా వాయిదా పడటంతో తనకు మేలే జరిగిందనంటున్నారు. కరోనా కాలం కలిసోచ్చింది అంటూ ఆమె 2021లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో ఫిట్ నెస్ కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక  ఇంటర్వ్యూలో ఆమె తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.
 

బాబు (అర్జున్) పుట్టి చూస్తుండగానే ఏడు నెలలు గడిచిపోయాయి. వాడి ఫోటోలను నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. వాటిని చూస్తూంటే  ఆనందంగా ఉంది. ఒక రకంగా బాబు పుట్టాక  చాలా సంతోషంగా ఉన్నాను. జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు టైం అంతా వాడితోనే... ప్రత్యేకమైన టైమింగ్ అంటూ ఏమీ ఉండవుకదా అందుకే నేను వాడి టైమింగ్ కు అనుగుణంగా మారాల్సి వస్తుంది. రాత్రివేళ కూడా చాలా సార్లు వాడు నిద్రలేస్తాడు. పాలు పట్టాలి ,బట్టలు మార్చాలి. అలా అన్నీ నేను చూసుకుంటున్నాను. వీటితో పాటు నా ఫిట్ నెస్ మీద కూడ దృష్టి పెట్టాల్సి ఉంది.

 

పెళ్లి చేసుకోవడం, అమ్మను కావడంతో నేను కుస్తీ మానేశాను అనుకుంటున్నారు. చాలామంది నెక్ట్స్ ఏంటీ అని అడుగుతుంటారు కూడా. అర్జున్ పుట్టాక మా ఇంట్లో వాళ్ళు కూడ ఇపుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నేను మాత్రం ఎప్పుడు  కుస్తీని వదిలేది లేదు.

 

అయితే 2020లో జరిగే పోటీల్లో పాల్గొన్నలేనేమో అని బాధపడ్డాను. అయితే  కరోనా కారణంగా  ఈ ఏడాది జరగాల్సి ఒలంపిక్స్  2021 లో జరగబోతున్నాయి. ఒక రకంగా మళ్ళీ నాకు పాల్గొనే అవకాశం వచ్చినట్లే అందుకే దీన్నీనేను అసలు వదులుకోను. కచ్చితంగా ఈ ఒలంపిక్స్ కి వెళ్తడంతో పాటు పతకాలు తేవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. అందుకోసం ఇప్పటి నుంచే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను.

మా ఇంట్లో అందరూ కుస్తీ యోధులే.. నా భర్త కూడా రెజ్లరే కావడంతో నన్ను అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. ఇక నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే నా గురువు. మా సోదరి, ఫ్యామిలీ మెంబర్స్ నన్ను గమనిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చేయగలవు, ఇంతకుముందు కన్నా ఇపుడే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు అంటూ ప్రోత్సహిస్తున్నారు. సాధించాలన్న తపన ఉంటే  చాలు ఎవరైనా చేస్తారు అంటూ వాళ్లందరూ  మోటివేట్ చేస్తున్నారు. అయితే నాన్నగారి గురించి ఒక విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. చాలా రోజుల తర్వాత  నాన్న మా ఇంటికి వచ్చారు.  రాగానే ఆయన  నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ని బరువు ఎంత ఉంది? కుస్తీ చేయాలనే కోరిక ఉందా లేదా? తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అని ప్రశ్నించారు.  నేను కాస్త బరువు చాలా పెరిగాను కాబట్టి నా బరువు తగ్గించి, మళ్ళీ ఎప్పటిలా కుస్తీ చేస్తాను అని చెప్పాను. దానికాయన అది చాలా కష్టం, ఇపుడు నువ్వింక ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నారు. అవును, నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి కష్టపడతాను, బరువు తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు కుస్తీ తప్పించి ఇంకేమి కనిపించడం లేదు.

 

మా నాన్న చెప్పినట్లే నిజానికి  రెజ్లర్స్ కి  బరువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే  బరువును బట్టే మన క్యాటగిరి అనేది నిర్ణయించబడుతుంది. లాస్ట్ టైం నేను  57 కేజీల విభాగంలో పాల్గొన్నాను.  దాని తర్వాత కూడ నేను ఆడాను.  ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో కూడ 5 7 కేజీల విభాగంలో  ఆడాను. ఇపుడు జరగబోయే ఒలంపిక్స్ కి 62 కేజీల విభాగం అవసరం. ఈ మధ్య నా ఫోటోలను చూసి సోషల్ కొంతమంది నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు. నా హర్డ్ వర్క్ ను గమనించకుండా కామెంట్స్  చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయితే వారి కామెంట్స్ కు బాధపడేతే అక్కడే ఆగిపోతాను. ఒకరకంగా ఇలాంటి నెగటివ్ విషయాలు కూడ నన్ను పాజిటివ్ గా మోటివేట్ చేస్తాయి. ఒక రకంగా వాళ్ళ   మీద జాలి కలుగుతుంది. ఇపుడు నేను ఓ బిడ్డకు తల్లి ని.  అమ్మఅయిన తర్వాత సహజంగానే శరీరంలో మార్పులు వస్తాయి. బరువు పెరుగుతారు. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా కాకుండా  మీరు ఇలా లావాపోయారేంటి? కుస్తీ వదిలేశారా? లావయితే ఇక కుస్తీ ఎలా చేయగలరు' అని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారంటేనే తెలిసిపోతుంది వాళ్ళకి అంతగా అర్థం చేసుకునే శక్తి లేదని. అందుకే నేను వాళ్ళ మీద జాలి పడి వదిలేస్తాను. అమ్మ అయినంత మాత్రానా నాకు ఇష్టమైన కుస్తీని వదిలేయాలా  దాన్ని ఛాలెంజ్ గా కూడా తీసుకుంటాను. మళ్ళీ నేను ఫిట్ అవ్వడానికి సాధన చేస్తున్నాను.