TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఎట్టకేలకు గాయత్రీ ప్రజాపతి అరెస్ట్..

Published on: Wed Mar 15, 2017 11:44AM

 

ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ప్రజాపతి గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయనను లఖ్‌నవూలో పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారానికి పాల్పడటమే గాక, తన కుమార్తెపై దాడి చేశాడని ఆరోపిస్తూ.. ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ప్రజాపతిని అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే అప్పటినుండి ప్రజాపతికి పరారీలోనే ఉన్నాడు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి ఆఖరికి అరెస్ట్ చేశారు. ప్రజాపతితో పాటు ఆయన కుమారుడు.. మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.