సవాంగ్ స్టోరీ సశేషం!.. 'డీమ్డ్ టూ బీ రిటైర్డ్'కి కేంద్రం కొర్రీ వేస్తే..!?
Published on: Sat Feb 19, 2022 2:40PM
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిపాదనలను గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపగా ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం పొందడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఇక్కడితో, సవాంగ్ స్టొరీ సుఖాంతం అయినట్లేనా, అంటే , లేదు, ఇంకా వుంది అంటున్నారు కొందరు అధికారులు. ఇప్పుదు బంతి కేంద్రం కోర్టులో ఉందని, ఐపీఎస్ సర్వీస్ బెనిఫిట్స్ కోల్పోకుండా, సర్వీసులో ఉండగానే ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవీ స్వేకరించేందుకు, సవాంగ్, ‘డీమ్డ్ టూబీ రిటైర్డ్’ క్లాజును ఉపయోగించుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సరే,లేదంటే సవాంగ్’కు చిక్కులు తప్పవని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి గౌతం సవాంగ్ హఠాత్తుగా బదిలీ చేసింది మొదలు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి’కి సన్నిహితునిగా పేరున్న గౌతమ్ సవాంగ్’ ను అదే జగన్ రెడ్డి కారణం ఏదీ చూపకుండా అత్యంత అవమాన కరంగా బదిలీ చేశారనే విమర్శలు అధికార, రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలోనే డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, సవాంగ్’ను సగౌరవంగా సాగనంపామనే, భ్రమలు కలిపించేందుకు ఆయన్ని, సర్వీస్ కమిషన్ చైర్మన్’గా నియమిచారు. అయితే, సర్కార్ చెపుతున్న కొత్త లాజిక్’ నిజం కాదని, సర్కార్’ కే కాదు, సవాంగ్’ కూ తెలుసు. అదే నిజమైతే, ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించరు. అలా ఆదేశించడమంటే... బదిలీ వేటు వేసినట్లేనని వేరే చెప్పనక్కర లేదు. నిజంగానే సవాంగ్‌కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని ముందే నిర్ణయించుకుని ఉంటే ఆ పద్ధతి వేరేగా ఉండేదని, ఇది కేవలం డ్యామేజి కంట్రోల్ చర్య తప్ప మరొకటి కాదని అంటున్నారు.
అదలా ఉంటే, సవంగ్ స్టొరీ ఇంతటితో ముసినట్లేనా అంటే కాదు, ఇంకా ఒక మెలిక అలాగే ఉంది. సర్వీసులో ఉన్న అధికారిని, రాజ్యాంగ (సర్వీస్ కమిషన్ చైర్మన్) పదవిలో నియమించేందుకు నిబంధనలు అంగీకరించవు. అందుకే సవాంగ్ నియామకం‘డీమ్డ్ టు బి రిటైర్డ్’ క్లాజుతో ప్రభుత్వం గవర్నర్ ఆమోదం పొందింది.అయితే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సర్వీస్ నిబంధలకు సంబదించి విషయాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ టూ బీ రిటైర్డ్ ’ క్లాజును అంగీకరించక పొతే, సవాంగ్ పరిస్థితి ఏమిటి? రెంటికి చెడిన రేవడిగా మారి పోతారా? ఏమిటి జరుగుతుంది, అనే విషయంలో అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరోవంక ఏపీపీఎస్సీ చైర్మన్ పోస్టులో చేరాలంటే సవాంగ్ ఐపీఎ్‌సగా తనకున్న సర్వీసు కోల్పోతారు. అందుకే ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి స్వీకరించేందుకు ముందు అంతగా సుముఖత చూపలేదు. అయితే, ప్రభుత్వం రాయబారాలు నడిపి, ఒప్పించినట్లు తెలిసింది. చివరకు ఆయన వీఆర్‌ఎ్‌సతో సంబంధం లేకుండా, ‘డీమ్డ్ టు బి రిటైర్డ్’ అనే నిబంధనను వాడుకున్నారు. అంటే, సవాంగ్ నియామకం జరిగిన వెంటనే, ఆయన రిటైర్ అయినట్టుగా భావిస్తారు. దీనివల్ల ఐపీఎ్‌సగా ఆయనకు సర్వీసు ప్రయోజనాలన్నీ పూర్తిగా లభిస్తాయి.కానీ, చివరకు ఏమి జరిగినా, సవాంగ్’ జగన్ రెడ్డి సర్కార్’కు చేసిన సేవలకు తగిన ఫలితమే దక్కింది. ఆ మచ్చ మచ్చగానే మిగిలిపోతుందని అధికారులు అంటున్నారు.


